తాళ్లగడ్డ (సూర్యాపేట) : ‘పేట’ను కరోనా వైరస్ వణికిస్తోంది. కరోనా ప్రమాదం నుంచి బయట పడుతున్నామనుకునే లోపే కొత్త కేసులు నమోదై కలవరపెడుతున్నాయి. ఇప్పటివరకు ఢిల్లీ మర్కజ్‌లో జరిగిన సమావేశాలకు హాజరైన వారిలో కుడకుడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి పాజిటీవ్ అని తేలింది. అతని ద్వారా తాజాగా భగత్‌సింగ్‌నగర్‌లో నివాసముంటున్న మరో వ్యక్తికి వైరస్ సోకినట్లు తేలింది. జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం ఎదురుగా ఉన్న అపోలో మెడికల్ దుకాణంలో పనిచేసే వ్యక్తికి వైరస్ సోకింది. అయితే ఈ వ్యక్తి కరీంనగర్ నుంచి వచ్చిన బంధువులతో కలిసి ఓ ఫంక్షన్‌కు హాజరైనట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం 16మంది వ్యక్తుల రక్తనమూనాలు సేకరించి హైదరాబాద్‌కు తరలించారు. అయితే ఆదివారం వచ్చిన 16మంది వ్యక్తుల రిపోర్టుల్లో ఒకరికి కరోనా పాజిటీవ్ వచ్చినట్లు ప్రకటించారు. మిగతా 15మంది వ్యక్తులకు నెగెటివ్ వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో రెండో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.
డేంజర్ బెల్స్..!